పవన్... సాయి తేజ్ రీమేక్ మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనేక మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ 3 సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓ జి మూవీ ల షూటింగ్ లలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే పవన్ తమిళ సినిమా రీమేక్ అయినటువంటి వినోదయ సీతం రీమిక్ లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పవన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవన్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తిగా గాక ... ఈ మూవీ యూనిట్ ఇతరుల పై చిత్రీకరించే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం పవన్ లేని రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తుంది . ఈ మూవీ లో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరో గా నటించబోతున్నాడు .

 ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఒరిజినల్ అయినటువంటి వినోదయ సీతం కు కూడా సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథను ... స్క్రీన్ ప్లే ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తుంది. పవన్ ... సాయి తేజ్ కలిసిన నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: