ఏజెంట్ మూవీపై శ్రద్ధ చూపిస్తున్న నాగార్జున..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అక్కినేని నాగార్జున వారసుల్లో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎన్నో సినిమాల్లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందినటు వంటి ఏజెంట్ అనే భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమేజా ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వరుస ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున "ఏజెంట్" మూవీ కి సంబంధించిన ఫైనల్ కాపీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ... ఇప్పటికే ఈ సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువ అయింది అని కొంత భాగాన్ని నాగార్జున కట్ చేయించినట్లు ... అలాగే ఈ సినిమాల్లోని అనేక విశాయలపై నాగార్జున సలహాలు ... సూచనలు ఇస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: