స్టార్ యాంకర్ ను అలా చూసి సిగ్గుతో కళ్ళు మూసుకున్న మోనాల్ గజ్జర్....!!

murali krishna
బుల్లితెరకు గ్లామర్ సొగసులు అద్దిన అతికొద్ది మంది యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలో శ్రీముఖి కూడా స్మాల్ స్క్రీన్ పై తనదైన అందాలతో రచ్చ చేస్తుంది .
తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తు ఉంటుంది.అలాగే చిన్నితెర రాములమ్మగా సూపర్ పాపులర్ అయింది. ఓ వైపు తన యాంకరింగ్తో అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లోను నటిస్తూ దూసుకుపోతోంది . ఇక హీరోయిన్ గా పరిచయమైన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 తో తెలుగు ఆడియెన్స్ కు చాలా దగ్గరైంది అప్పటి వరకు సినిమాల్లో నటించినా బిగ్ బాస్ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ. బిగ్ బాస్ తర్వాత కొన్ని షోస్ లోను నటించి మెప్పించింది. ఇక తాజాగా వీరిద్దరూ ఓంకార్ సిక్త్ సెన్స్ షోలో సందడి చేశారు . ఈ షోలో శ్రీముఖి అతి చిన్న స్కర్ట్ వేసుకుని తన అందాలతో అట్రాక్ట్ చేసింది.
భూమ్ బద్దలు పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది .ఆ తర్వాత మాకేమో మొత్తం కవర్ చేసుకోని రమ్మని.. కొందరేమో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తారు. అని ఓంకార్ ఛాతిపై చేయి వేసి రచ్చ చేసింది . ఓంకార్ తో తనదైన స్టైల్ తో తమను ఎక్స్ పోజింగ్ చేయనివ్వరూ అని శ్రీముఖి చెప్పింది. తర్వాత మోనాల్ గజ్జర్ చుట్టూ తిరుగుతూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. నీయవ్వ తగ్గేదేలే అంటూ మోనాల్ ను ఓ దెబ్బ కొట్టింది. శ్రీముఖి అలా చేస్తుందని ఊహించని మోనాల్ ఒక్కసారిగా షాక్ అయి సిగ్గుతో కళ్లు మూసుకుంది. శ్రీముఖి, యాంకర్ ఓంకార్ మాత్రం నవ్వుతూ ఉన్నారు. ఇలా పబ్లిక్ అందరూ చూసే షోలో మోనాల్ ను శ్రీముఖి అలా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు . ఇక 2012లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో హీరోకు సోదరిగా నటించి ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై అదుర్స్ అనే షోతో యాంకర్గా మారింది. అదుర్స్ ద్వారా యాంకర్ అయిన శ్రీముఖి అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం కొంత లిమిటెడ్ గానే షోస్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: