పూజ హెగ్డే డ్రెస్ పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్...!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే ఒక భారీ హిట్ కోసం కష్టపడుతూనే ఉంది. రాధేశ్యామ్ నుంచి ఇప్పటివరకు బుట్ట బొమ్మ ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు.

ప్రస్తుతం పూజా ఆశలన్నీ కూడా సల్మాన్ తో నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మీదనే ఉన్నాయట.తమిళ్ లో వీరమ్ అలాగే తెలుగులో కాటమరాయుడు సినిమాను హిందీలో సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడట.ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ అలాగే భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుందట.. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచేసిందని తెలుస్తుంది . వరుస ఇంటర్వ్యూలతో పూజా కూడా బిజీగా మారింది 

ఇక పూజా ఫ్యాషన్ గురించి అందరికి తెల్సిందే. మొదటి నుంచి కూడా అమ్మడు అందాల ఆరబోతలో అస్సలు తగ్గేదేలే అంటుంది. ఇక ఇది బాలీవుడ్ సినిమా కావడంతో తనలోని ఫ్యాషన్ మొత్తాన్ని కూడా బయటకు తీస్తుంది.. తాజాగా ఒక ఇంటర్వ్యూకు పూజా వేసుకున్న డ్రెస్.. సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్, డెనిమ్ బ్లాక్ జీన్స్ ను ఆమె వేసుకుంది. అయితే ఆ జీన్స్ రెండు వైపులా కిందవరకు కట్ చేసి అయితే ఉంది. అంటే థైస్ పై వరకు జీన్స్ షార్ట్ లా ఉందని తెలుస్తుంది. మిగతాది అంతా అలా వదిలేసిందట పూజ. దీంతో ఆ జీన్స్ ను.. అమ్మడిని సడెన్ గా చూస్తే ఏంటి చిరిగిన జీన్స్ వేసుకుంది అని అనిపిస్తుందట.. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా అదే అంటున్నారని తెలుస్తుంది.. ఏంటి పూజా .. అది జీన్సా అని కొందరు అయితే చిరిగింది.. చూసుకో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారట.. ఏదిఏమైనా ఈ డ్రెస్ లో పూజా పిచ్చ హాట్ గా ఉందని ఇంకొందరు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: