విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందాలతో అలరించిన సంయుక్త..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా నటించగా ... సాగర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 


అలాగే తాజాగా ఈ ముద్దు గుమ్మ సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇలా ఇప్పటి వరకు సంయుక్త నటించిన అన్ని మూవీ లు కూడా మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గ సంయుక్త కెరీర్ ను కొనసాగిస్తుంది. తాజాగా సంయుక్త "విరూపాక్ష" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  


సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ లో హీరో గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేనున్నారు. దానితో ఈ మూవీ ట్రైలర్ ను నిన్న ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది.  ఈవెంట్ కు సంబంధించిన ఈ ముద్దుగుమ్మ పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: