ఆరేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసిన "చంకీల అంగిలేసి" సాంగ్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమా దసరా. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేశారు. మొదటి నుండి ఈ మూవీ నుండి ఈ సినిమా బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.


భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన టాక్ ను మొదటి రోజే తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. దానితో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలలో "చంకీల అంగిలేసి" అనే సాంగ్ ఏ రేంజ్ లో ప్రజాధరణ పొందిందో మన అందరికీ తెలిసిందే.


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఓ రేర్ మార్కు వ్యూస్ ను టచ్ చేసింది. తాజాగా ఈ మూవీ లోని "చంకిల అంగిలేసి" సాంగ్ లిరికల్ వీడియో 50 మిలియన్ రేర్ మార్క్ ను యూట్యూబ్ లో టచ్ చేసింది. ఇప్పటివరకు ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 51 మిలియన్ వ్యూస్ ... 526 కే లైక్స్ లభించాయి. ఇప్పటికి కూడా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: