టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. 'SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా అనంతరం వెంటనే దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టుకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్ మూవీ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక వీరి కాంబినేషన్లో మొదటి సినిమా కావడంతో రాజమౌళి మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మూవీ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ షాప్ కూడా మొదలైందట. త్వరలోనే మహేష్ కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే రాజమౌళి మూవీ షూటింగ్లో పాల్గొంటారట మహేష్. అయితే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది.
అదేంటంటే ఈ ప్రాజెక్టును రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఏకంగా మూడు భాగాలుగా తీసుకురావాలని ఆలోచనతో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. ఇక ఇందులో పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించిన దర్శకులు ఉన్నారు. మూడు భాగాలు అంటే అది ఇప్పుడు రాజమౌళి - మహేష్ మూవీ తోనే మొదలు కాబోతోంది. ఇక ప్రస్తుతం ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ మూడు భాగాలని రాజమౌళి ఎంత గ్యాప్ తో రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది...!!