పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథాలజికల్ మూవీ 'ఆది పురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదటిసారి శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ అలాగే సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలు పెట్టారో తెలియదు కానీ అప్పటినుంచి ఈ సినిమా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా ఆది పురుష్ టీజర్ విడుదలైన తర్వాత టీజర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల శ్రీరామనవమి రోజు విడుదలైన పోస్టర్ పై కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఓ వ్యక్తి ఆది పురుష్ పోస్టర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాడు. సినిమాలో ప్రభాస్ లుక్ ను మేకర్స్ తన ఆర్ట్ నుంచి కాపీ కొట్టారని ఆరోపించాడు.
ఇటీవల ఆదిపురుష్ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ శ్రీరాముని రూపాన్ని రూపొందించడం కోసం తన ఆర్ట్ వర్క్ ని కాపీ చేశారని పేర్కొన్నాడు. తాను స్వయంగా రూపొందించిన రాముని రూపాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రతీక్ సంఘర్ అనే ఆర్టిస్ట్ తను రూపొందించిన రాముడి రూపాలను ఫేస్ బుక్ లో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆది పురుష్ మూవీ ఆర్టిస్ట్ టిపి విజయన్ తన పర్మిషన్ లేకుండా ఎలా వినియోగిస్తాడని ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ మాట్లాడుతూ.." నేను ఇండియాకు చెందిన ఆర్టిస్ట్ ని. ఏడాది క్రితమే రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం ఏడాది క్రితం నుండే నా అన్వేషణ మొదలు పెట్టాను.
ఆదిపురుష్ సినిమా కోసం పనిచేస్తున్న ఆర్టిస్ట్ నా ఆర్ట్ ని కాపీ కొట్టారు. కనీసం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాముడి రూపాన్ని ప్రదర్శించారు. ఇక ఈ ప్రాజెక్టు వైఫల్యానికి ఇది కూడా ఒక కారణం. ఈ ప్రాజెక్టు పై పని చేసే వ్యక్తులకు అభిరుచి, ప్రేమ ఏమీ లేవు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ని ప్లే చేస్తున్నారు. ఇక నా అసలు ఆర్ట్ వర్క్ కి లింక్ ఇస్తాను. ఆర్ట్ వర్క్ మరియు వాళ్లు పోస్ట్ చేసిన ఆర్ట్ వర్క్లు ఇప్పటికే తీసివేయబడకపోతే. నేను ఇప్పటికే స్క్రీన్ షాట్స్ తీశాను. ఎందుకంటే వాళ్లు దాన్ని కూడా తీసేస్తారని,ఆ తర్వాత ఏం జరుగునట్లు నటిస్తారని నాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను" అంటూ పేర్కొన్నాడు. మరి ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపణకి ఆది పురుష్ మూవీ టీం ఎటువంటి ఆన్సర్ ఇస్తారో చూడాలి...!!