షారుక్ 'జవాన్' లో బన్నీ క్యామియో.. షూటింగ్ కూడా అయిపోయిందట..?

Anilkumar
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మన తెలుగు సినిమా బ్రాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో కనిపిస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు హీరోని బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ బ్రాండ్ వాల్యూ అలా  ఉంది.మన టాలీవుడ్ రేంజ్ ఈ విధంగా మారుతుందని బాలీవుడ్ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయ్యారు. అయితే వీళ్ళ కంటే ముందే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీలో క్యామియో రోల్ ద్వారా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. 

బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్లోకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జవాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ కి జోడిగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇదే సినిమాలో మన అల్లు అర్జున్ ఓ క్యామియో రోల్ లో నటించనున్నాడని ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని వార్తలు వచ్చాయి.బన్నీ ఫ్యాన్స్ ఆ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం జవాన్ లో బన్నీ క్యామియో చేస్తున్నట్లు వచ్చిన న్యూస్ అబద్ధం కాదట. ఆ న్యూస్ నిజమేనట. జవాన్ క్లైమాక్స్ లో షారుక్ ఖాన్ కి హెల్ప్ చేసే పాత్రలో అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడంట.

అంతేకాదు ఇప్పటికే బన్నీకి సంబంధించిన సీన్స్ ని సీక్రెట్ గా షూటింగ్ చేసేసాడట అట్లీ. ఇక త్వరలోనే రిలీజ్ చేయబోయే టీజర్ లో కూడా బన్నీ లుక్ ను రివీల్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ న్యూస్ ని బన్నీ ఫాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇక బన్నీ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఇందులో గెస్ట్ రోల్ చేయనుందట. మరి బన్నీ దీపిక పదుకొనే ఈ మూవీలో ఎలాంటి రోల్స్ లో కనిపిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వేసవి కానుకగా జూన్ 2న ఈ సినిమాని హిందీ తోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: