'గేమ్ ఛేంజర్' నుండి రామ్ చరణ్ సెకండ్ లుక్.. ఎప్పుడంటే..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో 'గేమ్ చేంజెర్' మూవీ కూడా ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ లుక్ వీడియో గ్లిమ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో తండ్రి, కొడుకులు గా రామ్ చరణ్ ని చూపించబోతున్నాడు దర్శకుడు శంకర్. సినిమా ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర హైలెట్ గా ఉండబోతుందట. మరో పాత్రలో ఎలక్ట్రోరల్ ఆఫీసర్గా కనిపిస్తాడట. 

ఇక మొన్న విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ కూడా దానికి సంబంధించింది. అయితే ఇప్పుడు త్వరలోనే రామ్ చరణ్ రెండవ గెటప్ కి సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ సెకండ్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకున్నాడు. అయితే త్వరలో విడుదల చేయబోయే సెకండ్ లుక్ ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందట. ఇక లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ అని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో గేమ్ చేంజర్ మూవీలో సెకండ్ లుక్ ని విడుదల చేసేందుకు మేకర్స్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి మూవీ టీం ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ అప్డేట్ తో మెగా ఫాన్స్ రామ్ చరణ్ సెకండ్ లుక్ కోసం ఎంతో ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియార అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టంగా కనిపిస్తోంది.ఒకవేళ అనుకున్న సమయానికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే 2024 సమ్మర్ ఈ షిఫ్ట్ కావచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: