అందుకే సినిమాకు.. ఖుషి టైటిల్ పెట్టాను : శివ నిర్వాణ

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ ఉంటాయ్. ఇలా వచ్చిన సినిమాలు కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని ఇక ప్రేక్షకాదరణకు  నోచుకోవు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎప్పుడూ తమ సినిమాలకు కొత్త టైటిల్ను వెతికే పనిలో ఉంటారు దర్శక నిర్మాతలు. కానీ కొన్ని కొన్ని సార్లు కొత్త టైటిల్ కంటే పాత సినిమాల టైటిల్ నే తమ సినిమాకు పెడితే బాగుంటుందని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పుడు సూపర్ హిట్ సాధించిన సినిమా టైటిల్ ని ఇక ఇప్పటి సినిమాలకు కూడా పెడుతూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం.


 ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమాకు కూడా ఇలాంటి టైటిల్ ని ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన ఎవర్ గ్రీన్ మూవీ ఖుషి సినిమా టైటిల్ ని ఇక విజయ్ దేవరకొండ సినిమాకు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ఈ సినిమాకి అసలు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అన్న చర్చ మాత్రం ఇండస్ట్రీలో మొదలైంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ఇక ఖుషి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి.



 విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు ఖుషి అనే టైటిల్ పెట్టడానికి వెనుక అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ రాయగానే హీరోయిన్ పాత్రకు సమంత అయితే బాగుంటుందని అనుకున్నాను. ఇక సమంతకు జోడిగా విజయ్ అయితే సెట్ అవుతాడని నిర్ణయించుకున్నాను. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాలో బాగుంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ఒక ఫీల్ గుడ్ మూవీ.  ఇక నా సినిమాలో కూడా అంతే ఫీల్ ఉంటుంది. అందుకే ఆ ఖుషి మూవీ టైటిల్ని ఈ సినిమాకు పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు శివ నిర్మాణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: