వైరల్ గా మారిన తమ్మారెడ్డి కామెంట్స్....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా నటుడుగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ్ తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
సెలబ్రిటీల గురించి కూడా ఈయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డుల గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.తాజాగా పోసాని కృష్ణమురళి నంది అవార్డుల గురించి మాట్లాడుతూ నంది అవార్డులు కాదని అవి కమ్మ అవార్డులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో అవార్డులు ఒకే కులం వారికి వెళ్తాయని ఒకే కాంపౌండ్ కే నందులన్ని వెళ్ళాయంటూ ఈయన ఆరోపణలు చేశారు.
ఇలా నంది అవార్డుల గురించి పోసాని చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.ఇక ప్రస్తుతం ఇలాంటి అవార్డులు ఇవ్వలేనప్పుడు అవార్డుల గురించి ప్రస్తావన ఎందుకు అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. అవార్డులు ఇచ్చి లేనిపోని గొడవలు సృష్టించడం కన్నా ఇలా ప్రశాంతంగా ఉండడమే మంచిదని తెలిపారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఐక్యత ఏమాత్రం లేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. మనం చేసే పనిలో పోటీ ఉండాలి తప్ప ఈర్ష్య ద్వేషం వంటి వాటిలో పోటీ ఉండకూడదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చేసే పనిలో పోటీ కన్నా ఈ విధమైనటువంటి పోటీలు ఎక్కువగా ఉన్నాయని ఎప్పుడైతే కులతత్వం గ్రూపిజం అనేవి పోతాయో అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుందని తమ్మారెడ్డి ఈ సందర్భంగా ఇండస్ట్రీ గురించి, పోసాని చేసినటువంటి వ్యాఖ్యల గురించి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రేక్షకులు కూడా 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలే బాగా ఆడతాయనే భ్రమ నుంచి బయటకు రావాలని బలగం వంటి చిన్న సినిమాలు కూడా చరిత్ర సృష్టిస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలని ఈయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: