వైరల్ గా మారిన అల్లు అర్జున్ ... ఎన్టీఆర్ చాటింగ్..!

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నిన్న అనగా ఏప్రిల్ 8 వ తేదీన జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. బన్నీ పుట్టిన రోజును ఆయన అభిమానులు ఎంతో గ్రాండ్ గా ... సంతోషం గా నిర్వహించుకున్నారు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా బన్నీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా కొంత మంది సినీ ప్రముఖులు బన్నీ కి సోషల్ మీడియా వేదిక గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


ఇది ఇలా ఉంటే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ... బన్నీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ అంటూ ఒక పోస్ట్ చేశాడు. దానికి రియాక్ట్ అయిన బన్నీ థాంక్యూ బావ ... వర్మ్ హాగ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి ఎన్టీఆర్ ఓన్లీ హగ్స్ మాత్రమేనా ... పార్టీ లేదా పుష్ప అంటూ మరో రిప్లై ఇచ్చాడు.


దానికి అల్లు అర్జున్ వస్తున్న అంటూ ఒక ఎమోజిని పెట్టాడు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ... సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: