సీనియర్ సినీనటి కుష్బూ ఉన్నఫలంగా ఆసుపత్రి పాలయ్యారు. ఇలా ఈమె అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రి పాలయ్యారని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ విధంగా నటి కుష్బూ ఆసుపత్రి పాలయ్యానంటూ తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈమె కి ఏమైంది ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాల్సి న పరిస్థితి ఏర్పడిందనే విషయానికి వస్తే... తనకు రెండు రోజులుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. దీంతో తాను పరీక్షలు చేయించుగా తనకు ఎడినో వైరస్ సోకిందని ఈమె తెలియజేశారు.
ఈ వైరస్ ప్రభావం కారణంగా తనకు చాలా కష్టం గా అనిపించిందని ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని ఈమె తెలిపారు. ఎవరు కూడా ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఆశ్రద్ధ వహించకుండా జాగ్రత్తగా ఉండాలని ఈమె సూచించారు.ఇలా తనకు ఎడినో వైరస్ సోకిన కారణంగానే తాను ఆసుపత్రి పాలయ్యానని కుష్బూ తెలియచేయడంతో అభిమానులు ఆమె తొందరగా కోలుకొని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలు మరోవైపు రాజకీయాల లో కూడా ఎంతో బిజీ గా ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన కుష్బూ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి గా పదవి కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికి కుష్బూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాజకీయాలు సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా మారిపోయారు. అయితే తాజాగా ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఫోటోల ను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారాయి.