'సెట్స్ లోకి రావొద్దని చెప్పినా.. రామ్ చరణ్ బలవంతంగా వచ్చాడు'.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కి వెళ్ళింది. ప్రస్తుతం చెర్రీతో సినిమాలు చేయడానికి సౌత్ నుంచి నార్త్ వరకు చాలామంది డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.ప్రెజెంట్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఓ సినిమా అలాగే లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ఓ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'కిసికా భాయ్ కిసీ కా జాన్' మూవీ నుండి రిలీజ్ అయిన 'ఏంటమ్మా' అనే పాటలో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ లతో కలిపి..

రామ్ చరణ్ ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజిషన్ లో ఈ సాంగ్ చేయబడింది. హైదరాబాదులోనే ఈ సాంగ్ ని షూట్ చేశారు. అయితే ఈ సాంగ్ లో రామ్ చరణ్ కూడా పార్టిసిపేట్ చేయడానికి గల కారణాన్ని సల్మాన్ ఖాన్ గత ఏడాది గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాని ప్రకారం ఆ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ..' ఒకరోజు చరణ్ మా మూవీ సెట్స్ కి వచ్చాడు. వెంకటేష్ మరియు నా కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉందనే విషయాన్ని జానీ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాడు.

నాకు ఆ సాంగ్ లో మీ ఇద్దరితో కలిసి డాన్స్ చేయాలని ఉంది భాయ్ అని అన్నాడు. అయ్యో పర్లేదు చరణ్. ఇప్పుడు అవసరం లేదులే అని నేను చెప్పాను. కానీ మరుసటి రోజు చరణ్ కాస్ట్యూమ్స్ తో సెట్స్ లోనే ఉన్నాడు. అప్పుడు నేను చరణ్ ని చూసి ఆశ్చర్యపోయాను. నీకు ఓకే కదా అని అడిగాను. అప్పుడు చరణ్..' మీకోసం నేను ఇది చేయాలి భాయ్, నా తృప్తి కోసం చేయాలి' అని చెప్పాడు. అలా ఆ సాంగ్ షూటింగ్ జరిగింది' అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే కదా. అయితే దానికోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.ఇక అందుకు కృతజ్ఞతగా రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ మూవీలోని స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేశాడట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: