తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మంచి విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించిన సాయి తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ లో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను చాలా డిఫరెంట్ గా నిర్వహిస్తోంది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులకు మంచి అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.