రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కే జి ఎఫ్" మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఆ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
మరికొన్ని రోజుల్లోనే ఈ షూటింగ్ కూడా పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ప్రస్తుతం ఈ ప్రణాళికలు అన్ని మారినట్లు కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నాడు.
ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ మూవీ తర్వాత బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోయే వార్ 2 మూవీ లో నటించబోతున్నట్లు ... ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ తో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇది వరకే సలార్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మూవీ ని మరికొన్ని రోజులు ప్రశాంత్ నీల్ పోస్ట్ పోన్ చేసినట్లు ... దానితో దాదాపుగా సలార్ 2 మూవీ కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.