స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో అది ఇట్టే వైరల్ అవుతుంది. ఎప్పుడైతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుందో అప్పటినుంచి సమంతకు సంబంధించి ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ఆమధ్య మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం కోలుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ నటిస్తోంది. తాజాగా హిందీలో సమంత 'సిడాటేల్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే కదా. బాలీవుడ్ హీరో వరుణ్ దవన్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడన్ కలిసి నటించిన వెబ్ సిరీస్ కి హిందీ రీమేక్ గా వస్తుంది. అయితే హాలీవుడ్లో ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ సన్నివేశంలో బెడ్ మీద దారుణంగా రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టు హిందీలో రీమేక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రని ఇండియన్ వెర్షన్లో సమంత పోషిస్తుండటంతో.. సమంత కూడా ఆ సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. గతంలోనే ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించినందుకు సమంతపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఇక ఇప్పుడు మరోసారి సిడాటెల్ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ సీన్స్ లో నటిస్తే మరోసారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొన్న మన తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ద్వారా ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు. అయితే వెంకటేష్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ విమర్శలు కాస్త మన వెంకీ మామ కి ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక సమంత తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!