'NTR30' టైటిల్ కోసం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా..?

Anilkumar
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించుకున్న ఈ సినిమాని వచ్చేయడాది వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. కానీ ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు వచ్చే సంవత్సరం సినిమా విడుదలవడం అనుమానమే అని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. 

ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ని మూవీ టీమ్ పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి 'ఎన్టీఆర్ 30' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమా టైటిల్ ని ఆఫీసియల్ గా రివిల్ చేయడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. విశ్వసనీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 టైటిల్ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఆఫీసియల్ గా రివిల్ చేసే అవకాశం ఉందని మూవీ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అప్పటివరకు ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అంతా వేచి చూడాల్సిందేనట. అయితే ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

ఈ మేరకు టైటిల్ కోసం వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలా? అంటూ చిత్ర యూనిట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం పని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దింపాడు కొరటాల శివ.కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: