కొంత కాలం క్రితమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు ఈ మూవీ ని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కేవలం ఒకే ఒక పాట బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన "సిజి" పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో మూడు వారాల్లో ఈ పనులు మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి ఏప్రిల్ 28 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.