హమ్మయ్య.. మళ్లీ కలిసిన సుధీర్, రష్మీ?

praveen
తెలుగు బులితెరపై సుధీర్, రష్మీ జోడీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎక్కడైనా స్టేజి మీద కనిపించారూ అంటే చాలు వీరిని చూసి మురిసిపోయే ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రారంభమైన వీరి లవ్ ట్రాక్ ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెర మొత్తం పాకిపోయింది అని చెప్పాలి. ఇక కొన్నాళ్లపాటు అటు ఈటీవీలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కూడా అటు వీరిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ బ్యాక్ బోన్ గా నిలిచి టాప్ రేటింగ్ తెచ్చిపెట్టింది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.

 అయితే వీరిద్దరూ కేవలం స్టేజ్ మీద మాత్రమే అలా ప్రేమికులుగా నటిస్తామని.. సాధారణంగా అయితే మేము మంచి స్నేహితులం అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ సుధీర్, రష్మీ అంటే ప్రేమికులు అని అటు ప్రేక్షకులు మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి. జబర్దస్త్ లో మొదలైన వీరి రొమాన్స్ కెమిస్ట్రీ.. ఢీ షో ద్వారా పిక్స్ స్టేజ్ లోకి చేరిపోయింది. కొన్ని కార్యక్రమాలలో అయితే ఒకటి రెండు సార్లు వీరికి పెళ్లి కూడా చేసి టీఆర్పి సాధించారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఈటీవీలోని అన్ని కార్యక్రమాల నుంచి అటు సుదీర్ తప్పుకోవడంతో ఇక వీరిద్దరి జోడిని స్టేజిపై ఒకచోట చూడటం అటు ప్రేక్షకులకు కేవలం ఒక కల గానే మిగిలిపోయింది.

 ఇక అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో సుదీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా రష్మీ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఎట్టకేలకు రష్మీ, సుధీర్ జోడి మళ్లీ కలిశారు అనేది తెలుస్తుంది. త్వరలో ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సుదీర్ వస్తున్నాడు. ఇక వీరి కొంటె చూపులు చిలిపి మాటలతో ఎపిసోడ్ హైలైట్ గా మారింది. థాంక్యూ స్పెషల్ పేరుతో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ నిర్వహిస్తుండగా.. బుల్లితెర స్టార్స్ ఎదగడంలో దోహదం చేసిన వారిని వేదిక మీదకు పిలిచి కొందరు ధన్యవాదాలు చెప్పబోతున్నారు. ఈ వేదిక మీద సుదీర్ రష్మి తమ ప్రేమ బయటపెట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv

సంబంధిత వార్తలు: