ఆ ఒక్క విషయంలో.. రాజమౌళి కంటే సుకుమార్ బెస్ట్ తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడు ఎవరు అంటే అన్ని భాషల ప్రేక్షకులు చెప్పే పేరు ఒకే ఒకటి. అదే దర్శక ధీరుడు  రాజమౌళి. అంతలా తన సినిమాలతో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హవా నడిపిస్తూ ఉన్నాడు రాజమౌళి. అంతేకాదు ఇండియన్ సినిమాని ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అంతేకాదు ఇండియన్ సినిమా కోసం అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేంతగా ప్రభావితం చేసిన ఘనత కూడా రాజమౌళికి దక్కుతుంది అని చెప్పాలి.

 ఇక రాజమౌళి సినిమా చేస్తున్నాడు అంటే చాలు ప్రతి షాట్ విషయంలో ఎంత ఖచ్చితత్వంతో క్లారిటీతో ఉంటాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రమోషన్స్ లో ఇక రాజమౌళితో సినిమా అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న విషయాన్ని రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు చెప్పడం ద్వారా మరింతగా అందరికీ తెలిసిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకుడుగా కొనసాగుతున్న రాజమౌళి కంటే ఒక విషయంలో మాత్రం అటు సుకుమార్ 10 అడుగుల ముందే ఉన్నాడట.

 అది ఎందులోనో తెలుసా తన శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేసే విషయంలో. ఇప్పుడు వరకు రాజమౌళి దగ్గర పనిచేసి శిష్యరికం చేసిన వారు కొంతమంది దర్శకులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ వారిలో ఒకరు కూడా సక్సెస్ కాలేదు. కానీ సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసిన వారు మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా మారి సూపర్ హిట్లు కొట్టారు అని చెప్పాలి. ఇలా సుకుమార్ శిష్యుడు గానే ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లు సాధించి అదరగొట్టాడు. ఇటీవలే మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల సైతం నానీతో దసరా అనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు అని చెప్పాలి. కాగా గతంలో ఆర్జీవి శిష్యులు ఎక్కువగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు సుకుమార్ శిష్యులు వరుసగా ఇండస్ట్రీ లోకి వచ్చి హిట్టు కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: