నాని తదుపరి సినిమా పరిస్థితి ఏంటి..?

Divya
నాచురల్ స్టార్ నాని ,కీర్తి సురేష్ నటించిన చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలై భారీగానే కలెక్షన్లు రాబడుతోంది రెండు రోజులకే రూ .50 కోట్ల రూపాయల మార్పులు అందుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో హీరో నాని పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారని వార్తలు ఐతే వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

నాని గతంలో కూడా నటించిన చిత్రాలని పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దాదాపుగా వరుస మూడు సినిమాలు ఫ్లాప్ తర్వాత ఒక హిట్టు అందుకుంటూ ఉన్నారు. కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా ఎవరు మారిపోరు అలా మారిపోయారంటే తమ తదుపరిచిత్రాల పరిస్థితి కూడా ఏంటో ఆలోచించాలి అంటూ తెలియచేస్తున్నారు. ఒకవేళ నటించబోయే క్లాసికల్ ఫిలిమ్ తో ఇదే పునరావృతం చేయగలరా అనే విషయంపై సందిగ్ధతను తెలియజేస్తున్నారు.

నాని మొదటిసారి పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అయ్యారని అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి గా ఉంటున్నారు. నాని 30వ సినిమాల హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. దసరా సినిమాతో సక్సెస్ మీద ఉన్న నాని తన తదుపరి చిత్రాన్ని కూడా వెంటనే ఏడాదిలో విడుదల చేయాలని అభిమానులైతే భావిస్తూ ఉన్నారు. దసరా సినిమా షూటింగ్ పూర్తి అవ్వకముందే తన తదుపరిచిత్రాన్ని అయితే ప్రకటించారు. వచ్చే వారంలో ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చాలా స్పీడ్ మీద నాని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. నాని దసరా సినిమాలాగే ఈ సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: