"ఆరెంజ్" మూవీ రీ రిలీస్ రెస్పాన్స్ పై స్పందించిన నాగబాబు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్ అనే ప్రేమ కథ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటించగా ... హరీస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. కొణిదల నాగబాబు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించాడు.

మగధీర లాంటి విజయవంతమైన సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడం ... బొమ్మరిల్లు ... పరుగు లాంటి వరుస విజయాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని ఎదుర్కొంది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పట్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమాను తిరిగి ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ గురించి తాజాగా నాగబాబు స్పందించాడు ... ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి స్పెషల్ థాంక్స్ చెప్తున్నానని ... అలాగే ఈ మూవీ రీ రిలీజ్ లో సహకరించిన నిర్మాత అల్లు అరవింద్ మరియు బన్నీ వాసులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నాగబాబు తెలిపారు. అంతే కాకుండా సాయి రాజేష్, ధర్మేంద్ర మరియు ఎస్ కె ఎన్ లకు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని నాగబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: