నాని "దసరా" మూవీకి 2వ రోజు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ  భాషలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


రెండు రోజుల్లో నైజం ఏరియాలో ఈ మూవీ 10.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 3.02 కోట్లు , యు ఏ లో 2.06 కోట్లు , ఈస్ట్ లో 1.18 కోట్లు , వెస్ట్ లో 71 లక్షలు , గుంటూరు లో 1.46 కోట్లు ,  కృష్ణ లో 92 లక్షలు , నెల్లూరు లో 47 లక్షలు.  మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 20.08 కోట్ల షేర్ ... 34.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.15 కోట్లు , ఇతర భాషలలో 65 లక్షలు , నార్త్ ఇండియాలో 60 లక్షలు , ఓవర్సీస్ లో 5.60 కోట్లు మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రెండు రోజుల్లో 29.08 కోట్ల షేర్ ... 52.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: