నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

shami
నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన సినిమా దసరా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాలో నాని ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ తో అలరించాడని. ధరణి పాత్రలో నాని మాస్ ర్యాంపేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు. నాని కథ విన్నప్పటి నుంచి దసరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి సినిమా ఓకే చెప్పడానికి ముందే చిన్న టెస్ట్ పెట్టగా అందులో పాస్ అయ్యాడు.
ఇక అప్పుడు తన కథ లాక్ చేసిన నాని సినిమా కోసం తన వంతు భారీ సపోర్ట్ అందించాడు. నిజానికి డైరెక్టర్, నిర్మాతని చూసి కాదు దసరా సినిమా ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అంటే అది కేవలం నాని స్టామినా వల్లే. సినిమాపై నాని పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అందుకే సినిమా సెట్స్ లో ఉన్నప్పుడే కాదు రిలీజ్ కు ముందు రోజు వరకు నాని సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఇంత రిస్క్ తీసుకున్న నానికి ఈ సినిమా ఫలితం సంతృప్తిని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే సినిమాకు సూపర్ టాక్ వచ్చేసింది.
నానిని ఇలాంటి రఫ్ లుక్ లో చూసి ఆయన ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నాని ముందునుండి చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. కథ నచ్చి సరైన విధంగా తీస్తే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించిన నాని శ్రీకాంత్ తో తను అనుకున్న విధంగా సినిమా చేయించాడు. ఫైనల్ గా సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ టాక్ తెచ్చేసుకుంది. మొత్తానికి నాని ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం గెలిచిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: