పవన్ ... సుజిత్ కాంబినేషన్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ని "ఓ జి" అనే టైటిల్ తో లంచ్ కూడా చేశారు. v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను ఏప్రిల్ నెల నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

కాక పోతే ఈ మూవీ షూటింగ్ లో పవన్ మే నెల నుండి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పవన్ కళ్యాణ్ ... సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న "ఓ జి" మూవీ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే టైటిల్ ను చిత్ర బృందం పెట్టబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త చాలా రోజుల నుండి వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మూవీ దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ లను సర్చ్ చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే దర్శకుడు సుజిత్ తన సోషల్ మీడియాలో పవన్ మూవీ కోసం ప్రస్తుతం లొకేషన్ లను వెతుకుతున్నట్లు కొన్ని ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు కూడా అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: