రేపు "దసరా" మూవీతో ఆ మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా సంతోష్ నారాయణన్ సంగీత సారధ్యంలో రూపొందిన దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రేపు అనగా మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుండగా ... ఈ సినిమా ప్రీమియర్ ను ఈ రోజు అర్ధరాత్రి నుండే "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించనున్నారు.
 

ఈ మూవీ ప్రీమియర్ షో లకి "యూ ఎస్ ఏ" ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే సమంత ప్రధాన పాత్రల రూపొందిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కానుంది. గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని 2 D మరియు 3 D వర్షన్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను రేపు అనగా మార్చి 30 వ తేదీన దసరా సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ లలో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. శాకుంతలం మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: