అఫీషియల్ : టైగర్ నాగేశ్వరరావు మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ అదిరి పోయే లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో రవితేజ పై అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు ... అందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఇప్పటికే చిత్ర బృందం చిత్రీకరించగా అవి అద్భుతమైన రీతిలో వచ్చినట్లు ... ఈ యాక్షన్స్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ పనులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీన ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: