ఎట్టకేలకు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన ఆది పురుష్ చిత్ర బృందం..!!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పోతుంది ఆది పురుష్.. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే డేటును కూడా చెప్పే నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టిందని చెప్పవచ్చు. పనిలో పనిగా ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా ఖుషి అయ్యేలా చేశారు డైరెక్టర్ ఓం రౌత్.. ఒక మోషన్ సెన్సార్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం మైథాలజీ డ్రామా లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.. కృతి సనన్ సీతగా, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ న్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల అయింది.

రీసెంట్గా విడుదలైన టీజర్ తో అందరికీ షాకు గురయ్యేలా చేసింది..ముఖ్యంగా గ్రాఫిక్స్ బాగలేదని కామెంట్లు  వినిపించాయి.. దీంతో మరొకసారి రంగంలోకి ఓం రౌత్ ఈ చిత్రం గ్రాఫిక్స్ మళ్లీ రీ డిజైన్ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు గతంలో వినిపించాయి అందుకోసం మరొక రూ .100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆది పురుష్ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి.
దీంతో ఆది పురుష్ చిత్ర బృందం.. తమ సినిమాను సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నామని తాజాగా అనౌన్స్మెంట్ చేశారు. అందుకు సంపాదించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అది కూడా త్రీడి ఫార్మాట్లో థియేటర్లో విడుదల కాబోతోందని తెలియజేశారు. ఇక అలాగే ఈ చిత్రం గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .శ్రీరామనవమి నుంచి వరుసగా అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు మేకర్ తెలియజేసినట్లు సమాచారం మార్చి 30 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: