దసరా మూవీలోని 4వ సాంగ్ విడుదల తేదీని ... టైమ్ ని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం మూడు పాటలను ... కొన్ని ప్రచార చిత్రాలను ... టీజర్ మరియు ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఈ మూవీ నుండి  చిత్ర బృందం విడుదల చేసిన దాదాపు అన్ని ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన మూడు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి అదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 4 వ పాట విడుదలకు సంబంధించిన ప్రకటనను చేసింది.

ఈ మూవీ నుండి 4 వ పాటను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం 4 వ సాంగ్ విడుదలకు సంబంధించి విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: