"ఓజి" మూవీ లొకేషన్ల వేటలో దర్శకుడు సుజిత్..!

Pulgam Srinivas
వెరీ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి సుజిత్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు రన్ రాజా రన్ మూవీ తో సినిమా దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టి ... ఆ తర్వాత సహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే దర్శకుడు గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ క్రేజీ దర్శకుడు తన తదుపరి మూవీ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నాడు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. పవన్ తో ఈ యువ దర్శకుడు "ఓ జి" అనే  గ్యాంగ్ స్టార్ మూవీ ని రూపొందించ బోతున్నాడు. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు ఈ సినిమా కోసం లొకేషన్ ల వెతుకులాటలో పడ్డాడు.
 

అందులో భాగంగా తాజాగా సుజిత్ ఈ సినిమా కోసం లొకేషన్ లను వెతుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఈ దర్శకుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించినట్లు తెలుస్తుంది. పవన్ కేటాయించిన రోజుల్లోనే పవన్ కు సంబంధించిన షూటింగ్ బాగానే ఈ చిత్ర బృందం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: