ప్రభాస్ దర్శకుడితో శివ కార్తికేయన్ సినిమా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో రాధాకృష్ణ ఒకరు. ఈయన గోపీచంద్ హీరోగా రూపొందిన జిల్ మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే శ్యామ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇలా రాదే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రాధాకృష్ణ తన తదుపరి మూవీ ని తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాధాకృష్ణ ... శివ కార్తికేయన్ కు ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన శివ కార్తికేయన్ ... రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే తెలుగు దర్శకుడు అయినటువంటి అనుదీప్ కె వి దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ మూవీ లో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: