రవితేజ "రావణాసుర" మూవీ పై క్లారిటీ ఇచ్చిన సుదీర్ వర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి సుధీర్ వర్మ తాజాగా రావణాసుర అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించాడు. అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సుశాంత్ నటించగా ... మరి కొన్ని ముఖ్య పాత్రలలో అను ఇమాన్యుయల్ , పరియా అబ్దుల్లా , మేఘ ఆకాష్ , దాక్షా నాగర్కర్ , పూజిత పన్నోడ లు నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం టీజర్ ను విడుదల చేసింది. రవితేజ డైలాగ్ డెలివరీ అలాగే సుశాంత్ పాత్ర కూడా బాగుండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటు వంటి సుధీర్ వర్మ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా సుధీర్ వర్మ "రావణాసుర" మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ అసలు ఎలాంటి సినిమాకి కూడా రీమేక్ కాదని ... ఇది కేవలం రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కంప్లీట్ న్యూ స్టోరీ అని ఈ దర్శకుడు కన్ఫామ్ చేశాడు. రామేశ్వర్ మరియు భీమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: