ఓజి : అప్పటినుండి ప్రారంభం కానున్న షూటింగ్..!

Pulgam Srinivas
పవన్ లిస్ట్ లో ఉన్న సినిమా లలో తన అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ లలో "ఓ జి" మూవీ ఒకటి. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు .

ఈ సినిమాను గ్యాంగ్ స్టార్ కథ తో సుదీప్ పెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఈ మూవీ లో హీరో గా నటించనుండడం ... యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనుండడం ... అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ గ్యాంగ్ స్టార్ కథ తో తెరకెక్కబోతోంది అని తెలియడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఈ సినిమా స్టార్ట్ కాక ముందే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రొడక్షన్ పను ల్లో ఈ మూవీ దర్శకుడు ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది .  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది . దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఏప్రిల్ చివరి వారంలో కానీ ... మే మొదటి వారంలో కానీ మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ పై ఎలాంటి పాటలు మరియు పైట్స్ సన్నివేశాలు ఉండవు అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: