అప్పటినుండి పాన్ ఇండియా మూవీ షూటింగ్లో జాయిన్ కానున్న పవన్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీర మల్లు మూవీ షూటింగ్ ను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో దాదాపు సమానంగా భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ను కూడా పవన్ ప్రారంభించాడు. కానీ ఇప్పటికే బీమ్లా నాయక్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయ్యి కూడా దాదాపు సంవత్సరం పూర్తి అయింది. కానీ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు .

ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ కి సంబంధించిన మిగిలి ఉన్న ఒక షెడ్యూల్ షూటింగ్ ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఈ చిత్ర బృందం పూర్తి చేసే ఆలోచన లో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందుతోంది  .


నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ ప్రచార చిత్రాల్లో పవన్ కళ్యాణ్ లుక్  కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: