వెంకటేష్ మూవీ లో ఆ యంగ్ బ్యూటీ..?

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. వెంకటేష్ ఆఖరుగా ఏఫ్ 3 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో రానా తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది వెంకటేష్ కెరియర్ లో మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ తో వెంకటేష్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ ... వెంకటేష్ సరసన హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మను సంప్రదించగా ఈ ముద్దుగుమ్మ కూడా వెంకటేష్ హీరోగా తనకెక్కుతున్న సైంధవ్ మూవీ లో హీరోయిన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే శ్రద్ధా శ్రీనాథ్ ఇది వరకు నాని హీరోగా రూపొందిన జెర్సీ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: