రవితేజ దర్శకుడితో పవన్ సినిమా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో సుధీర్ వర్మ ఒకరు. ఈ దర్శకుడు ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర అనే మూవీcకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ఫరియా అబ్దుల్లా , అను ఇమాన్యుయల్ , పూజిత పొన్నాడ , దాక్ష నాగర్కర్ , మేఘ ఆకాష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ప్రస్తుతం ఈ సినిమా బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ దర్శకుడు సుధీర్ వర్మ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.  తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ ... నేను గతంలో దర్శకత్వం వహించినటు వంటి కేశవ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాగా నచ్చింది.

కొన్ని రోజుల క్రితమే ఓ కథను నాకు చెప్పి పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలి అని అన్నారు. ఎప్పుడు పవన్ తో మూవీ ఉంటుంది అనేది త్వరలోనే తెలియజేస్తాను అని ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించాడు. ఇలా సుధీర్ వర్మ ... పవన్ కళ్యాణ్ తో మరి కొన్ని రోజుల్లో సినిమా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ లోను వినోదయ సీతం రీమిక్ మూవీ లోను నటిస్తున్నాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓజి మూవీ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: