అల్లు అర్జున్ ఆర్య 2 ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...?

murali krishna
అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ల్లో తను కూడా ఒకరు అయితే తను కెరియర్ మొదట్లో చేసిన ఆర్య ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ కూడా తెలిసిందే అదే టైప్ లో ఆర్య 2 సినిమా కూడా చేయాలి ఆని అనుకొని తెరకెక్కించారు...అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఈ సినిమా హిట్ అవ్వకపోవడాని కి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.అప్పటిదాకా క్లాస్ సినిమాలు చేసిన అల్లు అర్జున్ ఆ సినిమాలో చిన్న నెగిటివ్ టచ్ లో ఉండే పాత్రల్లో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నారు... కానీ ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రనే చాలా మైనస్ అయింది ఎలా అంటే అప్పటి వరకు హీరో అంటే మంచి వ్యక్తి గా ఉండాలి అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్న ఆడియన్స్ కి ఆయన చేసిన పాత్ర పెద్దగా నచ్చలేదు.
ఇక దానికి తోడు సుకుమార్ మేకింగ్ కూడా తోడైంది... అన్ని విధాలా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ వల్లే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది..ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపు 2 సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ చేసినట్టు సమాచారం.... ఇక ఆ తరువాత 100% లవ్, వన్ మరియు నాన్నకు ప్రేమతో, రంగస్థలం అలాగే పుష్ప లాంటి సినిమాలు చేశాడు.ఈ సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని  సాధించాయి. దానికి తోడు బాలీవుడ్ లో కూడా సుకుమార్ పేరు బాగా మారుమ్రోగిందని చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమా కనుక హిట్ అయితే ఆయన ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని అందరూ కూడా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: