మహానటిగా మరొకసారి నిరూపించుకోనుందా..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా నానితో కలిసి దసరా సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. కీర్తి సురేష్ నాటిక ఇప్పటికే నేషనల్ అవార్డు కూడా అందుకుంది. మహానటి చిత్రం తర్వాత మళ్లీ అంతటి స్కోప్ ఉన్న పాత్రలో నటించలేదు ఈ ముద్దుగుమ్మ.

తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో కలిసి గత ఏడాది ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో ఈమె నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ఒక హీరోయిన్ నటన బయటపడాలి అంటే ఆమెకి స్కోకు ఉన్న పాత్రలు పడితేనే అది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అయితే కమర్షియల్ హీరోయిన్ కథలతో హీరోయిన్స్ కి పర్ఫామెన్స్ చేసే అవకాశం ఉండదు.. కానీ నాని నటిస్తున్న దసరా సినిమాలో మాత్రం ఆ పరిస్థితి ఉండదనే మాట ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా న్యాచురల్ గా కనిపించబోతోందని ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇందులో నాని నటనకు ఎంత పాత్ర ఉందో కీర్తి సురేష్ క్యారెక్టర్ కు కూడా అంతే స్కోప్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను కీర్తి సురేష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. మరొకసారి ఈమె మహానటి సినిమా అని గుర్తు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం సినిమాలో సమంత పుష్ప చిత్రంలో రష్మిక పాత్రలకు ఎంతటి స్కోప్ ఉందో దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ పాత్రకు అంతే స్కోప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి పూర్తిగా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: