'వినోదయ సీతం' రీమేక్ కోసం పవన్ రికార్డ్ రెమ్యునరేషన్.. ఒక్క రోజుకే అన్ని కోట్లా..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోనే కాదు సినిమాలతో కూడా బిజీ అయిపోయాడు. ఒక దాని తర్వాత మరో సినిమా చేస్తూ తాను ఇప్పటివరకు కమిట్ అయిన ప్రాజెక్ట్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'వినోదయ సీతం' రీమేక్ కూడా ఒకటి. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లీడ్ రోల్స్ లో దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని   తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు పవన్ కళ్యాణ్ కి రికార్డు స్థాయిలో పారితోషకం ముట్ట చెబుతున్నట్లుగా లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. గతంలో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్లు తీసుకోగా.. 

ఈ సినిమా కోసం ఏకంగా 3.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అటు నిర్మాతలు కూడా ఈ విషయంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ కు హై రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేయించుకుంటున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన మొత్తం డేట్స్ తో ఏకంగా 75 కోట్ల రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తీసుకుంటున్నట్లుగా సమాచారం. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నాన్ పాన్ ఇండియా సినిమా లిస్ట్ లో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ లో మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, ప్రియాంక జవాన్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అలాగే ధమాకా బ్యూటీ శ్రీ లీల ఓ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సెట్స్ పైకి  తీసుకెళ్లబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక దీని తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ తో 'ఓ జి' అనే వర్కింగ్ టైటిల్ తో పవన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా వీలైనంత తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాలన్నిటిని పూర్తిచేసేలా పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికలతో ముందుకు కొనసాగుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: