ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

Divya
అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి తనయ..బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె గత కొద్ది రోజులుగా తనకు సౌత్లో సినిమాలు చేయాలని ఉంది అంటూ .. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన మనసులో మాటను బయటపెట్టింది ఈ అమ్మడు.. ఈ క్రమంలోనే తాజాగా తన కల నెరవేరబోతుందని చెప్పాలి.
ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.  అందుకు సంబంధించిన పోస్టర్ను సినిమా నుండి ఆమె పుట్టిన రోజు సందర్భంగా  చిత్ర బృందం విడుదల చేశారు కూడా. దీంతో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు తెలుగులోకి అరంగేట్రం చేస్తుండడంతో అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా జాన్వి కపూర్ మనకు కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.
ఇదిలా ఉండగా ఈమె ఈ సినిమా కోసం ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ఒక వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చాలా వైరల్ గా మారుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సర్జనా నటించిన 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. ఇందుకోసం నిర్మాతలు కూడా ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇందులో అధికారిక నిజాలు మాత్రం బయటకు రాలేదు. ఇకపోతే హిందీలో ఈమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది అలాంటిది ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టబోతున్నందుకు ఏకంగా మరో రూ.2 కోట్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమా సక్సెస్ అయితే జాన్వి మరింత డిమాండ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: