ఆ సినిమా కథ విని మహేష్ బాబు భయపడ్డాడా..!!
సందీప్ వంగ మొదటిసారి కలిసి యానిమల్ కథ చెప్పే సమయంలో చాలా సర్ప్రైజ్ గా అయ్యానని తెలిపారు రణబీర్ కపూర్. కథ విన్న తర్వాత రెస్ట్ రూమ్ కి వెళ్లి తనను తాను ఒకసారి అద్దంలో చూసుకొని చాలా భయపడ్డాను అని కెరియర్లో ఇలాంటి కథ పాత్ర చేయడం మొదటిసారి అని చాలా భయపడ్డాను ఈ కథకు నేను న్యాయం చేయగలనా అనిపించింది అని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య సాగే ఆసక్తికరమైన గ్యాంగ్ స్టర్ డ్రామాగా యానిమల్ సినిమా ఉంటుందని సమాచారం.
బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే సౌత్ సినిమాలలో హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే బాలీవుడ్లో హింస చాలా తక్కువే అని చెప్పాలి హిందీ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటూనే సౌత్ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. అయితే ఇలాంటి సినిమాను మహేష్ బాబు మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి యాక్షన్ డ్రామా తండ్రి కొడుకుల నేపథ్యంలో సాగే చిత్రం మహేష్ బాబుకు సెట్ అవ్వదని తెలిసే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.