ఆస్కార్ ఈవెంట్ కోసం పయణమైన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్..!

Divya
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాకు బయలుదేరాడు. తాజాగా ఎన్టీఆర్ తన అన్న తారకరత్న మరణాన్ని దిగమింగుకొని మరీ తప్పని పరిస్థితుల్లో మార్చి 12వ తేదీన జరిగే ఆస్కార్ వేడుకలలో పాల్గొనడానికి ఎన్టీఆర్ పయనం అయ్యారు. ఎన్టీఆర్ కి ఇప్పుడు హెచ్సీఏ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇన్ని రోజులు అమెరికాలో రామ్ చరణ్ సందడి చేయగా ఇప్పుడు ఇద్దరూ కలిసి అమెరికాలో హల్చల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.. ఇక మరోవైపు తన హీరోలతో జక్కన్న ఇంకా అక్కడే ఆస్కార్ వరకు ఉండి తన అవార్డును ఇండియాకు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే ఇలా ఎయిర్పోర్టులో సందడి చేసినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో చాలా వైరల్ అవుతున్నాయి. ఆయన చాలా క్యాజువల్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
మామూలుగా అయితే కొరటాల శివతో చేయబోయే సినిమా షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది.  అయితే ఈ షూటింగ్ ఉంటుందని ఆయన హెచ్సీఏ అవార్డులకు కూడా వెళ్లలేకపోయారు.  అంతలోనే తారకరత్న మరణం , పెద్దకర్మ అంటూ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి ఉండడంతో అమెరికాకు వెళ్లలేకపోయినా ఆయన హెచ్సీఏ అసోసియేషన్ కి కూడా తాను రాలేకపోతున్నానని విన్నపం కూడా చేసుకున్నారు.  ఈ క్రమంలోనే ఆయనకు రెండు హెచ్సీఏ అవార్డులు వచ్చినట్లు హెచ్సిఏ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగు ఆస్కార్ వేడుకల అనంతరం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాలో జాన్వి కపూర్ ఫైనల్ చేసినట్లు అందుకు సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది.  ఇందులో చాలా క్యూట్ గా జాన్వీ కపూర్ తన ఎక్స్ప్రెషన్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆస్కార్ అవార్డుతో తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: