పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ మహారాజా రవితేజ వీరిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కూడా తెరపై కనిపించినట్టే బయట కూడా చాలా సింపుల్ గా కనిపించే హీరోలు. ఇక అలాంటి ఈ హీరోలు ఇద్దరూ కలిసి ఒక్క మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఇక అలాంటి రోజు భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు గాని గతంలో అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ సినిమా అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా మిస్సయిందని అంటున్నారు. 

ఇక ఆ సినిమా ఏంటంటే సుస్వాగతం. పవన్ కళ్యాణ్ కెరియర్లో మూడవ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ గుడ్ కంబైన్స్ బ్యానర్ పై ఆర్బి చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో దేవయాని హీరోయిన్గా నటించింది. రఘువరన్, ప్రకాష్ రాజ్ ,సుధాకర్ తదితరులు ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలలో నటించారు.  ఇక ఈ సినిమా అప్పట్లో లవ్ టుడే అని ఒక తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. 1998 జనవరి 1న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి రవితేజ స్నేహితుడిగా కనిపించే అవకాశం వచ్చింది.

అప్పటికి రవితేజ పెద్ద స్టార్ హీరో ఏమీ కాదు.. అసలు హీరోనే కాదు.. హీరోగా ఎంట్రీ కూడా రవితేజ ఇవ్వలేదు.. కానీ కొన్ని సినిమాల్లో కొన్ని కీలక పాత్రలో నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చిన సమయంలో రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో నీకోసం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. దాంతో రవితేజ కి డేట్స్ లేక పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని వదులుకున్నాడు రవితేజ. అలా గతంలో పవన్ కళ్యాణ్ మరియు రవితేజ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా మిస్సైంది అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: