సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి ఎక్కువ క్రేజ్ ఉంటే ఆ హీరోయిన్ హవా నడుస్తూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఇప్పుడు అలానే అందరి నోట వినిపిస్తున్న ఏకైక హీరోయిన్ పేరు శ్రీ లీల. పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. ఎంట్రీ సినిమా తోనే ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ కూడా అయిపోయింది. తన నటనతో అందంతో డాన్స్ తో ఇలా అన్నింటితో మంచి గుర్తింపును తెచ్చుకుంది. వీటన్నిటితో ఒక్కసారిగా కుర్రకారులను కట్టిపడేసింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం స్టార్ హీరోలు సీనియర్ హీరోలు యంగ్ హీరోలో అని తేడా లేకుండా అందరూ ఈమె పేరును జపం చేస్తున్నారు. ఇటీవల మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా అనంతరం ఈమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీ లీల మహేష్ బాబు తో పాటు నితిన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా బోయపాటి మరియు రామ్ కాంబినేషన్ లో వస్తున్న ఒక సినిమాలో సైతం ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా నవీన్ పోలిశెట్టితో కూడా ఒక సినిమా చేయడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.ఈ సినిమాలతో పాటు వైష్ణవ తేజ్ సినిమాలో కూడా నటిస్తోందట ఈమె. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె సినిమాలే కాకుండా ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా సిద్ధమవుతుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఇక ఈ పాట కోసం స్త్రీలను అడిగారట. అయితే శ్రీ లీల మాత్రం పవన్ మీద ఉన్న అభిమానంతో ఐటెం సాంగ్స్ ఐటం చేసేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!