సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఆనందంగా ఉన్నాడు రాంచరణ్.ఎందుకు అంటే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇక ఈ విషయాన్ని ఇటీవల మెగా అభిమానులతో అధికారికంగా పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇదిలా ఉంటే ఇక ఉపాసన మరియు రామ్ చరణ్ లది ప్రేమ వివాహం అని చాలామందికి తెలిసే ఉంటుంది.
అయితే రామ్ చరణ్ కంటే ముందే ఉపాసనని వేరే ఒక స్టార్ హీరో ప్రేమించారని తెలుస్తోంది. ఇక ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ మరియు ఉపాసన ఒక క్లబ్ మీటింగ్ లో తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు. దీనికంటే ముందే ఉపాసనని ఒక స్టార్ హీరో ప్రేమించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ హీరో కి పెళ్లి అయిపోయింది. కానీ అప్పట్లో ఆ స్టార్ హీరో ఉపాసనని తొలిచూపులోనే ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆ సమయంలో ఆ యుక్త వయసులో ఉండడం వల్ల అది ప్రేమ లేక ఆకర్షణ అని తెలియక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడట ఆ స్టార్ హీరో. చాలా రోజులు ఉపాసనని తనలో తానే ప్రేమించుకున్నాడట.
ఆ సమయంలోనే రామ్ చరణ్ మరియు ఉపాసన ప్రేమలో ఉన్నారన్న విషయం అధికారికంగా బయటికి రావడంతో ఆ స్టార్ హీరో తన ప్రేమని ఎక్కడ కూడా బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆ స్టార్ హీరో కి పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ స్టార్ హీరో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో చాలామంది ఈ వార్త విన్న తర్వాత రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ స్టార్ హీరోకి భార్యగా అయ్యేది కాబోలు అంటూ కామెంట్లో చేస్తున్నారు..!!