టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. కానీ చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఇక ఆ కొద్దిమంది స్టార్ హీరోలలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త పలు రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ కు ఎండిగా వ్యవహరించిన నార్ని శ్రీనివాస్ రావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఎన్టీఆర్ భార్య ప్రణతి తన చిన్నతనం నుండే హైదరాబాదులోనే పెరిగి ఇక్కడే తన గ్రైడియేషన్ పూర్తి చేసింది.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకుంది ప్రనతి. ఇక వీరిద్దరి వివాహం 2011లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం దంపతులకు ఇద్దరూ కొడుకులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలో మరొకవైపు తన వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు కుటుంబానికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చే హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాల తరువాత తనకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే తన భార్య పిల్లలతో వెకేషన్స్కు వెళుతూ సరదాగా గడుపుతూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్.తన భార్య లక్ష్మీపతి జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పుడు చాలా సపోర్ట్ గా ఉంటుంది.
అందుకే ఈ జంటకు టాలీవుడ్ లో మంచి కపుల్ గా కూడా పేరుంది. ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్కి ఎంత కట్నం ఇచ్చింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మీ ప్రణతి తన పెళ్లి సమయంలో అత్తారింటికి భారీగా పట్న కానుకలు తీసుకొచ్చిందిని అంటున్నారు. వేలకోట్లకు అధిపతి అయిన తన తండ్రి జూనియర్ ఎన్టీఆర్ కి దాదాపుగా 250 కోట్లకు పైగానే కట్నం ఇచ్చారని అంటున్నారు. దాంతో పాటు లక్ష్మీ ప్రణతి పేరును కూడా వెయ్ కోట్లకు పైగానే ఆస్తులను కూడా తన తండ్రి రాసిచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అత్తారింటికి భారీగానే కట్నం తెచ్చిందన్నమాట..!!