ప్రాజెక్ట్-k: సంగీతం అందించేది ఎవరంటే..?

Divya
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k కూడ ఒకటీ. ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా లో భారీ విజువల్ ఎఫెక్ట్ చిత్ర యూనిట్ మనకు పలు రకాల పోస్టర్లలో చూపించడం జరుగుతోంది .ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలలో కూడా అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంగీతాన్ని మిక్కీ జయేర్ అందిస్తున్నట్లుగా ఇదివరకే వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై చిత్ర బృందం నిర్మాత అశ్వని దత్ తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు మిక్కీ జయేర్ సంగీతాన్ని అందించడం లేదని ఈ సినిమాకు సంతోష్ నారాయణ తో పాటు మరొక యంగ్ ఫిమేల్ మ్యూజిక్ అందించబోతున్నట్లు అశ్విని దత్త తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే నటిస్తోంది.అలాగే బిగ్ బి అమితాబచ్చన్ ,దిశా పటాని తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్  ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్కు మరియు సినిమా సక్సెస్ను అందిస్తుందో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్-k తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆది పురష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: