ఆయన చేసిన మోసం వల్లే రాకేష్ సుజాతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా..!?

Anilkumar
ప్రస్తుతం టీవీ ఛానల్లో ప్రసారమయ్యే షోలలో లవ్ ట్రాక్స్ ఎంతలా ఎక్కువ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుదీర్ రష్మీ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ఎంతలా క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక వారి బాటలోనే ప్రస్తుతం చాలామంది తయారయ్యారు. ఇక స్క్రీన్ మీద ఈ జంటల మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి వీళ్ల మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుంది అన్న సందేహాలు వస్తున్నాయి.కానీ అవన్నీ నిజం కాదు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇక ఈ విషయాన్ని ఆ జంటలు చాలాసార్లు సందర్భాలలో చెప్పడం జరిగింది. కానీ ఒక జంట మాత్రం మేము నిజంగా ప్రేమించుకుంటున్నామని పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ

 తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఆజంటే రాకేష్ సుజాత.. రాకేష్ జబర్దస్త్ లో ఒక పెద్ద కమెడియన్.. సుజాత ఒక టీవీ ఛానల్ లో న్యూస్ లీడర్గా పనిచేస్తుంది.. దాని అనంతరం స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో కి వచ్చింది ఈమె. ఇక ఆ షో ద్వారా కోట్లాదిమంది జనాలకు పరిచయం అయ్యి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన సుజాతకి అనంతరం స్టార్ మా ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్లకు అడగడం జరిగింది. అలా వరుస ప్రోగ్రాంలు చేస్తూ బిజీ అయింది సుజాత. ఇక ఆ షో లో ఆమె బాగా నటించడంతో రాకేష్ తన టీమ్ లోకి చేర్చుకున్నాడు. దాని అనంతరం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సుజాత పనితీరు రాకేష్ కి ఎంతో నచ్చడంతో

ఆమెని తన టీమ్ లో తీసుకున్నాను అని.. డైరెక్టర్ కి కూడా చెప్పాను అని.. వెంటనే డైరెక్టర్ కూడా ఓకే చెప్పారు అని.. అనంతరం సుజాతని రాకేష్ టీమ్ లోకి చేర్చుకొని లౌకి సంబంధించిన కామెడీ ని వీరిద్దరూ చేశారు.. ఆ సమయంలో వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది.. దాని అనంతరం వారిద్దరూ కలిసి చట్టపట్టలేసుకుని తిరగడం.. కష్టసుఖాలను పంచుకోవడం తో రాకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులకు బాగా దగ్గరయింది. అనంతరం తెలియకుండానే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట.. తరువాత నెమ్మదిగా రాకేష్  సుజాతకి ప్రపోజ్ కూడా చేశారట.. ప్రపోజ్ అయితే చేశాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోవాలి అని అనుకోలేదట. అలా తన జీవితంలోకి అడుగుపెట్టిందట తన అదృష్ట దేవత సుజాత. అంతేకాదు డైరెక్ట్ చేసిన మోసం వల్లే తమ మధ్య ప్రేమ పుట్టిందని ఆ ప్రేమ కాస్త ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది అంటు చెప్పుకొచ్చాడు రాకేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: